సూర్య భగవానుడి ఆకృతిలో దీపోత్సవం
SDPT: వర్గల్ మండలం నాచగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో కార్తీకమాసం ఆదివారం పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలో నిత్య దీపోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు సూర్య భగవానుడి ఆకృతిలో దీపోత్సవాన్ని ఏర్పాటు చేశారు. కాగా ప్రత్యేకంగా నిర్వహించిన ఈ దీపోత్సవ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.