గూడూరులో పండుగలా పింఛన్ల పంపిణీ

గూడూరులో  పండుగలా పింఛన్ల పంపిణీ

TPT: పండుగలా పింఛన్లు పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు టీడీపీ తిరుపతి పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి మట్టం శ్రావణి రెడ్డి పేర్కొన్నారు. శనివారం గూడూరు మండలం చెన్నూరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను లబ్ధిదారుల ఇళ్లవద్దకే వెళ్లి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం రూ.4000 పింఛన్లను అందిస్తుందని ఈ నెల ఒకరోజు ముందుగానే అందించామన్నారు.