ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు పై గ్రామస్తుల ఆగ్రహం

HNK: ఐనవోలు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు పై గ్రామస్థులు ఆదివారం ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లు ఉన్నవారికే మళ్లీ ఇళ్లు కేటాయిస్తున్నారని, భారీ వర్షాలతో ఇళ్లు కూలిన వారిని పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అధికారులకు భజన చేసేవారికి ప్రాధాన్యత ఇస్తున్నారని, సామాన్యులను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. MLA ఈ అన్యాయంపై దృష్టి సారించాలని కోరారు.