'గంజాయి అమ్మితే కఠిన చర్యలు'
JGL: గంజాయి అమ్మినా, తాగినా, రవాణ చేసినా కఠిన చర్యలు తీసుకుని భవిష్యత్తులో పీడీ యాక్ట్ నమోదు చేస్తామని సీఐ సురేష్ బాబు అన్నారు. కోరుట్లలో గంజాయి విక్రయిస్తున్న షేక్ అమన్, ఎండీ ముఖిమ్లను సీసీఎస్ సీఐ శ్రీనివాస్, ఎస్సై చిరంజీవి సిబ్బంది కలిసి అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద నుంచి 210 గ్రాముల గంజాయి, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.