VIDEO: అప్పు వివాదంలో హెడ్ కానిస్టేబుల్ ఆగ్రహం
HNK: నగరంలోని గోకుల్ నగర్‌లో తల్లీ కొడుకుపై ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ యాదగిరి దాడి చేసిన ఘటన ఇవాళ జరిగింది. వివరాల ప్రకారం.. బాధితులు శ్రావణ్, అరుణ, హెడ్ కానిస్టేబుల్ వద్ద రూ.3.20లక్షలు అప్పుగా తీసుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా అప్పు చెల్లించేందుకు కొంత సమయం కావాలని కోరగా, ఆగ్రహించిన యాదగిరి భాధితులపై దాడి చేశారు. కాగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.