VIDEO: పర్యాటకులతో కళకళలాడిన గిరిజన మ్యూజియం
ASR: కార్తిక మాసం, వారాంతం కావడంతో అరకులోయకు పర్యాటకుల తాకిడి పెరిగింది. పర్యాటకులతో గిరిజన మ్యూజియం నిన్న కళకళలాడింది. మ్యూజియంలోని గిరిజనుల జీవన విధానం, వ్యవసాయ పనిముట్లు, అలంకరణ వస్తువులు, ఆచార వ్యవహారాలు, సామాజిక స్థితిగతులను తెలిపే కళాకృతులు, దింసా నృత్యాలు పర్యాటకులను ఆకట్టుకున్నాయి. ఈ మేరకు 2,174 మంది సందర్శించుకున్నట్లు సిబ్బంది తెలిపారు.