తండ్రిపై ప్రజావాణిలో ఫిర్యాదు

తండ్రిపై ప్రజావాణిలో ఫిర్యాదు

JGL: వెల్గటూర్ మండలంలోని సంకనపెళ్లికి చెందిన జెస్సికా అనే బాలిక తన తండ్రి నుంచి ప్రాణాపాయం ఉందని ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. తల్లి శకుంతలను బంగారం కోసం వేధించి ఇంటి నుంచి పంపించారని, తమను చంపేస్తామని బెదిరిస్తున్నారని తెలిపింది. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న తాను ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని పేర్కొంది.