ధాన్యం కొనుగోలు కేంద్రం తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

MDK: వెల్దుర్తి మండలం శెట్టిపల్లి కలాన్ గ్రామంలో ఐకెపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రంలో రైతులతో మాట్లాడుతూ.. రైతులు తమ ధాన్యం ప్యాడి క్లీనర్‌తో శుభ్రం చేసి కొనుగోలు కేంద్రం వద్ద తూకం వేయాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలకుండా ధాన్యం కొనుగోలు చేయాలన్నారు.