వర్షాలకు రహదారులు అధ్వానంగా మారిపోయాయి..!
VKB: కురుస్తున్న వర్షాలకు రహదారులు అధ్వానంగా మారిపోయాయి. కుల్కచర్ల నుంచి దాదాపూర్ వెళ్లే రహదారి రాంనగర్ గ్రామ శివారులోని బ్రిడ్జి అధ్వాన స్థితిలో కూలేందుకు సిద్ధంగా ఉంది. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన స్పందన లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. బ్రిడ్జిపై గుంతలు ఏర్పడి నీరు నిలిచి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని వాహనదారులు, ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.