పత్తి రైతులకు స్లాట్ బుకింగ్ అవకాశం: ఏవో
GDWL: పత్తి రైతులు సోమవారం ఉదయం 8:30 గంటల నుంచి స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చని అయిజ ఏవో జనార్ధన్ తెలిపారు. స్లాట్ బుక్ చేసుకున్న రైతులు ఈనెల 17న గద్వాలలోని బాలాజీ కాటన్ మిల్ లేదా అలంపూర్‌లోని వరసిద్ధి వినాయక కాటన్ మిల్స్‌లో పత్తిని విక్రయించుకోవచ్చని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరాడు.