నేడు ఎన్నికల నియమావళిపై యాచారంలో సమావేశం
RR: యాచారం మండలంలోని DSR ఫంక్షన్ హాల్లో గురువారం ఉదయం 11 గంటలకు ఎన్నికల నియమావళిపై అవగాహన సమావేశం జరుగుతుందని ఎంపీడీవో రాధారాణి తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికలలో పోటి చేస్తున్న సర్పంచ్, వార్డు అభ్యర్థులకు ఎన్నికల నియమ నిబంధనలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సర్పంచ్, వార్డు అభ్యర్థులు విధిగా హాజరు కావాలని ఆమె కోరారు.