'తడి చెత్త ఎరువుతో పంటల దిగుబడి పెరుగుతుంది'
PLD: నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద బాబు బుధవారం ములకలూరులో పర్యటించారు. తడి, పొడి చెత్త సేకరణను ఆయన పరిశీలించారు. సేంద్రియ ఎరువులు తయారు చేసే షెడ్లను పరిశీలించి కార్మికులతో మాట్లాడారు. తడి చెత్త ఎరువుతో భూసారం, పంటల దిగుబడి పెరుగుతుందన్నారు. గ్రామ పరిశుభ్రత కోసం ప్రజలు తప్పనిసరిగా చెత్తను వేరుచేసి సిబ్బందికి ఇవ్వాలని ఆయన సూచించారు.