VIDEO: కంభంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు కలకలం

VIDEO: కంభంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు కలకలం

ప్రకాశం: కంభం చెరువుకు వెళ్లే దారిలో ఓ పంట పొలంలో ఉన్న పురాతన నంది విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు తొలగించి తవ్వకాలు జరిపిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. నంది విగ్రహం కింద గుప్తనిధులు ఉన్నాయనే ఉద్దేశంతో తవ్వకాలు జరిపి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటనపై పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని తెలిసింది. దీనిపై ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సివుంది.