నాగాయలంక రేవుకు చేరిన వరద నీరు

ఉమ్మడి కృష్ణా జిల్లాలో కురుస్తున్న వర్షాలకు ప్రకాశం బ్యారేజీ నుంచి విడుదలైన వరద నీరు నాగాయలంక రేవుకు చేరింది. శ్రీరామ పాదక్షేత్రం పుష్కర ఘాట్‌లో కృష్ణమ్మ విగ్రహాన్ని తాకుతూ వరద ఉద్ధృతి కనిపించింది. మత్స్యకారులు పడవలను ఒడ్డుకు చేర్చి లంగర్లు వేశారు. ఈ వరద ఉదృతి పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలియజేసారు.