ఖాళీ ఇంటికి రూ.1.99కోట్ల కరెంట్ బిల్లు
AP: కాకినాడ సామర్లకోట టిడ్కో కాలనీకి చెందిన దాసరి దుర్గకు భారీ బిల్లుతో విద్యుత్ శాఖ షాక్ ఇచ్చింది. టిడ్కో ఫ్లాట్లో ఎవరూ నివాసం లేకపోయినా భారీగా బిల్లు రావడంపై అసహనం వ్యక్తం చేశారు. దీనిపై స్థానిక విద్యుత్ కార్యాలయంలో బాధితులు ఫిర్యాదు ఇచ్చారు. కొత్త మీటర్ మార్చడం వల్లనే టెక్నికల్ ప్రాబ్లమ్‌తో కరెంట్ బిల్ ఎక్కువగా వచ్చిందని విద్యుత్ అధికారులు వెల్లడించారు.