VIDEO: గన్నవరం కోర్టు వద్ద ఆసక్తికర సంఘటన

కృష్ణా: గన్నవరం కోర్టుకు గురువారం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ హాజరయ్యారు. కోర్టు విధించిన నిబంధనల ప్రకారం ఆయన సంతకాలు చేశారు. ఈ క్రమంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఓ అభిమాని జన్మదిన వేడుకలను కోర్టు సమీపంలో నిర్వహించారు. ఈ వేడుకల్లో వంశీ పాల్గొని అభిమానితో కలిసి కేక్ కట్ చేయించారు. దీంతో అక్కడికి చేరుకున్న అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.