నిత్యపూజ స్వామి హుండీ ఆదాయం రూ.10,26,926

KDP: సిద్ధపటం మండలంలోని శ్రీ నిత్య పూజయ్య స్వామి మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా 25 నుంచి 27 వరకు లంకమల అభయారణ్యంలో వెలసిన నిత్య పూజయ్య స్వామి హుండీ ఆదాయాన్ని గురువారం లెక్కించారు. రూ.10,26,926 నగదు, 1.324 కేజీల వెండి, 2,650 గ్రాముల బంగారం వచ్చినట్లు చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ శివయ్య తెలిపారు.