ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల

NDL: పగిడ్యాల మండలం ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి కేసీ ఆయకట్టుకు సాగునీరు విడుదల చేశారు. మండల పరిధిలోని నెహ్రూనగర్, ముచ్చుమర్రి, ఆంజనేయనగర్, ప్రాతకోట దిగువన కేసీ ఆయకట్టు రైతుల సంక్షేమం ముచ్చుమర్రి ఎత్తి పోతల పథకం నుంచి ఒక పంపు నుంచి 245 క్యూసెక్కుల నీరు విడుదల చేసినట్లు కేసీ కెనాల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నరేశ్ తెలిపారు.