సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

ప్రకాశం: సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కనిగిరి సీఐ ఖాజావలి సూచించారు పెదచెర్లోపల్లి మండలంలోని గుదేవారిపాలెంలో సీఐ పల్లెనిద్ర కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా స్థానికులతో సీఐ సమావేశం ఏర్పాటు చేసి సైబర్ నేరాలు, వేసవిలో దొంగతనాలు పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నేరాల నియంత్రణకు గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.