రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు విద్యార్థులు ఎంపిక
ప్రకాశం: సంతనూతలపాడు మండలం ప్రాథమిక పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయుడు G. శేషి రెడ్డి తెలిపారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన ఎంపికల్లో అండర్-14 బాలికల విభాగంలో గ్లోరీ, రాజేశ్వరి, కావ్య, అండర్-14 బాలుర విభాగంలో వినూత్న కుమార్ తదితరులు ఎంపికయ్యారన్నారు.