WWC ఫైనల్: బలంగా భారత్ బ్యాటింగ్ లైనప్
మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా రేపు దక్షిణాఫ్రికాతో జరగనున్న ఫైనల్ పోరులో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్‌లో మన బ్యాటర్లు రాణించాలి. స్మృతి మంధాన, జెమీమా, హర్మన్‌ప్రీత్, రిచా ఘోష్, దీప్తి శర్మ, షెఫాలీ వర్మ వంటి ప్లేయర్లతో మన బ్యాటింగ్ లైనప్ బాగుంది. అయితే, సౌతాఫ్రికా స్టార్ బౌలర్లు కాప్, ఖాఖా బౌలింగ్‌ను ఎదుర్కొంటే భారత్ గెలిచే అవకాశాలు మెండుగా ఉంటాయి.