VIDEO: రాజవొమ్మంగి పీహెచ్‌సీలో వైద్యుల కొరత

VIDEO: రాజవొమ్మంగి పీహెచ్‌సీలో వైద్యుల కొరత

ASR: రాజవొమ్మంగి పీహెచ్‌సీలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల రెండు ప్రమాదాలు జరిగినా డాక్టర్లు లేరని స్థానికులు తెలిపారు. శుక్రవారం రాత్రి ఓ క్షతగాత్రుడికి చికిత్స చేసేందుకు వైద్యులు లేక, ఉన్న ఒక్క నర్సుకు కుటుంబ సభ్యులే గ్లౌజులు వేసుకుని సాయం చేయాల్సి వచ్చింది. అత్యవసర వేళ ఈ దుస్థితిపై ప్రజలు గగ్గోలు పెడుతున్నారు.