పార్టీ బలోపేతంపై అధ్యక్షులకు జగన్ దిశానిర్దేశం

KRNL: ఉమ్మడి కర్నూలు జిల్లాలోని వైసీపీ జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డితో మంగళవారం వైసీపీ ఆధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడలో సమావేశమయ్యారు. పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. కర్నూలు, నంద్యాల తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ భవిష్యత్ కార్యక్రమాలపై చర్చించారు.