23 రోజుల్లో నేల కూలిన 625 చెట్లు

23 రోజుల్లో నేల కూలిన 625 చెట్లు

HYD: రెండు వారాలుగా నగరంలో అడపాదడపా బలమైన గాలులతో వర్షాలు కురుస్తున్నాయి. దాని కారణంగా ఈ నెల 1 నుంచి 23 వరకు GHMC పరిధిలో 625 చెట్లు నేల కూలినట్లు విపత్తు స్పందన దళం (DRF) లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. చెట్లు కూలిన ఘటనలపై తమకు ఫిర్యాదులు వస్తుంటాయని, వాటిని ఎప్పటికప్పుడు తమ సిబ్బంది పక్కకు తొలగిస్తున్నారని ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్ రెడ్డి తెలిపారు.