ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: CITU

ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: CITU

GNTR: రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్, సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళగిరిలోని అంబేడ్కర్‌ సెంటర్‌లో శనివారం నిరసన చేపట్టారు. ఆ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శివాజీ మాట్లాడుతూ.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించిన నేపథ్యంలో ఆటో కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలన్నారు.