దివ్యాంగుల ఆందోళన.. షర్మిల డిమాండ్

AP: కూటమి ప్రభుత్వానికి దివ్యాంగులపై మానవత్వం లేదని ఏపీసీసీ చీఫ్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. అనర్హత పేరుతో 20 ఏళ్ల నుంచి పెన్షన్‌పై బ్రతుకుతున్న వారికి సైతం రద్దు చేయాలని చూడటం సిగ్గుచేటన్నారు. అర్హుల పేర్లు తొలగించి వారిని వేధించడం సరికాదన్నారు. అర్హులకు అన్యాయం జరగకుండా చూడాలని, వెంటనే వారి పెన్షన్లు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.