రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ELR: ఉంగుటూరు (M) జాతీయ రహదారి వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పెరవలి (M) ఉసులుమర్రు చెందిన కొత్తపల్లి నాగేంద్ర బైక్ అమరావతి వెళుతుండగా సోమా కంపెనీ వద్ద స్థంభాన్ని ఢీకొన్నారు. అతనిని హైవే అంబులెన్స్‌లో తాడేపల్లిగూడెం ఆసుపత్రికి తీసుకువెళ్లగా.. మృతి చెందినట్లు చేబ్రోలు ఎస్సై తెలిపారు.