రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ
ATP: ఎల్లనూరు మండలం మేడికుర్తి గ్రామంలో ప్రభుత్వం నూతనంగా అందిస్తున్న పట్టాదారు పాసుపుస్తకాలను మార్కెట్ యార్డ్ డైరెక్టర్ రామకృష్ణారెడ్డి రైతులకు అందజేశారు. వీఆర్వో దిలీప్ కుమార్ రెడ్డి, సర్వేయర్ బాబాతో కలిసి ఆయన రాజముద్ర గల పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు అందజేశారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు.