చెత్త తరలింపు ప్రక్రియను పరిశీలించిన మేయర్
వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 24వ డివిజన్‌లో చెత్త తరలింపు ప్రక్రియను ఇవాళ మేయర్ గుండు సుధారాణి పరిశీలించారు. తడి, పొడి చెత్తను వేరు వేరుగా అందించాలని స్థానికులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ తేజస్వి శిరీష్, CMHO రాజారెడ్డి, MHO రాజేష్, సానిటరీ సూపర్‌వైజర్లు భాస్కర్, గోల్కొండ శ్రీను తదితరులు పాల్గొన్నారు.