అమెరికాతో దౌత్య బృందాలు చర్చిస్తున్నాయి: నిర్మలా

అమెరికాతో దౌత్య బృందాలు చర్చిస్తున్నాయి: నిర్మలా

వాణిజ్య చర్చల కోసం అమెరికాతో భారత్ దౌత్య బృందాలు చర్చలు జరుపుతున్నాయని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. 'చర్చలకు భారత్ ద్వారాలు తెరిచే ఉన్నాయి. దౌత్య బృందాలు అమెరికాతో సంప్రదింపులు కొనసాగిస్తున్నాయి. వాణిజ్య చర్చలు కొనసాగే అవకాశం ఉంది' అని తెలిపారు. తాజాగా సవరించిన జీఎస్టీ సంస్కరణలకు అమెరికా సుంకాలతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.