తొర్రూరులో హైఅలర్ట్... వాహనాల తనిఖీలు
MHBD: ఢిల్లీ పేలుళ్ల నేపథ్యంలో మంగళవారం రాత్రి ఖమ్మం- వరంగల్ జాతీయ రహదారిపై తొర్రూరు ఎస్సై గొల్లమూడి ఉపేందర్ ఆధ్వర్యంలో వాహనాలను తనిఖీ చేశారు. అనుమానస్పద వ్యక్తులు, వస్తువులు కనబడితే వెంటనే డయల్ 100కు లేదా పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు. ఈ తనిఖీల్లో పెద్దవంగర ఎస్సై ప్రమోద్ కుమార్, ఏఎస్సై ప్రభాకర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.