నేడే లక్ష్మీనరసింహ స్వామి వారి కళ్యాణ మహోత్సవం

నేడే లక్ష్మీనరసింహ స్వామి వారి కళ్యాణ మహోత్సవం

SDPT: మరో యాదాద్రిగా ప్రసిద్ధిగాంచిన బెజ్జంకిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం సాయంత్రం తిరు కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించనున్నారు. సాయంత్రం ఐదు గంటలకు ధ్వజారోహణ అనంతరం స్వామివారి దివ్య కళ్యాణం ఘనంగా జరగనుంది. ఈ మహోత్సవాన్ని వీక్షించేందుకు పరిసర ప్రాంతాలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలిరానున్నారు.