రోడ్డు ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలు
అన్నమయ్య: ములకలచెరువు(M)బురకాయలకోట వద్ద బుధవారం రాత్రి జరిగిన ద్విచక్ర వాహన ప్రమాదంలో సత్యసాయి జిల్లా తనకల్లు మండలానికి చెందిన లక్ష్మీ అనే మహిళ తీవ్రంగా గాయపడింది. రోడ్డు పక్కన పని చేసుకుంటున్న లక్ష్మీని, మదనపల్లెకు చెందిన రామాంజులు తన బైక్‌తో ఢీకొన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో లక్ష్మితో పాటు బైక్ నడుపుతున్న రామాంజులు గాయపడ్డారు. బాధితులను వెంటనే ఆసుపత్రికి తరలించారు.