విద్యుత్ సరఫరాకు అంతరాయం
ఏలూరు: రూరల్ మండలం మాదేపల్లి సెక్షన్ సుంకరవారితోట సబ్‌స్టేషన్ శ్రీపర్రు ఫీడర్ పరిధిలో విద్యుత్ తీగల మరమ్మతులు, చెట్లు కొమ్మల తొలగింపు పనులను మంగళవారం చేపట్టనున్నట్లు ఈఈ అంబేద్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. కావున ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు శ్రీపర్సు, కలకుర్ర, మహేశ్వరపురం, మానూరు, హరిపురం గ్రామాలకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు.