మత్స్యకారులకు గుడ్ న్యూస్.. సబ్సిడీపై వాహనాలు

మత్స్యకారులకు గుడ్ న్యూస్.. సబ్సిడీపై వాహనాలు

నిర్మల్: చేపల విక్రయాల కోసం 'ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన' కింద సబ్సిడీపై బైక్‌లు అందిస్తున్నారు. ఒక్కో యూనిట్ విలువ రూ.75,000 కాగా, జనరల్ అభ్యర్థులకు 40%, మహిళలు/ఎస్సీ/ఎస్టీలకు 60% రాయితీ ఉంటుంది. మత్స్య సహకార సంఘం సభ్యత్వం, లైసెన్స్ ఉన్న అర్హులు మార్చి 5వ తేదీలోగా జిల్లా మత్స్యశాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని అన్నారు.