‘ట్రంప్ పరిస్థితి 'ముందు నుయ్యి.. వెనక గొయ్యి'’
ఇరాన్‌తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పరిస్థితి 'ముందు నుయ్యి.. వెనక గొయ్యి'లా తయారైందని సీఐఏ మాజీ అధిపతి లియోన్ పనెట్టా విమర్శించారు. మూడు వారాలు దాటినా యుద్ధం ముగియకపోవడం, నాటో దేశాలు సహకరించకపోవడంతో ట్రంప్ ఒంటరి అయ్యారని పేర్కొన్నారు. ముందస్తు ప్రణాళిక లేకుండా యుద్ధానికి వెళ్లడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడిందని ఆయన విశ్లేషించారు.