'అసాంఘిక కార్యక్రమాలపై ఉక్కుపాదం'

'అసాంఘిక కార్యక్రమాలపై ఉక్కుపాదం'

GNTR: చేబ్రోలులో అసాంఘిక కార్యకలాపాలను సహించేది లేదని, అలాంటి వారికి కఠిన శిక్ష తప్పదని నూతన ఎస్సై వీర నారాయణ హెచ్చరించారు. సోమవారం ఆయన చేబ్రోలు పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా బాధ్యతలు చేపట్టారు. సాధారణ బదిలీల్లో భాగంగా ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన వీర నారాయణకు పోలీస్ సిబ్బంది స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.