పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

కడప కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్‌తో కలిసి పులివెందుల, ఒంటిమిట్ట మండలాల పోలింగ్ కేంద్రాలను శుక్రవారం పరిశీలించారు. ఆగస్టు 12న జరగనున్న జడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా సాగేందుకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఓటు వేయగల వాతావరణం కోసం ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నామని తెలిపారు.