చంద్రగ్రహణం.. ఆ గ్రామంలో వింత ఆచారం..!
కాకినాడ: చంద్రగ్రహణం సందర్భంగా రమణయ్యపేటలో గ్రామస్తులు చేసిన ఓ పని అందరినీ విశేషంగా ఆకట్టుకుంటుంది. గ్రామస్తులు ఇత్తడి పళ్లెంలోని నీటిలో ఓ రోకలి బండను నిలబెట్టారు. గ్రహణం ప్రారంభ సమయం నుంచి అది అలానే పడిపోకుండా నిటారుగా నిలబడి ఉండడం గమనార్హం. సూర్యచంద్రుల గురుత్వాకర్షణ శక్తుల సమతుల్యత వల్లే ఇలా జరుగుతుందని, ఇది ఆనవాయితీగా వస్తుందని స్థానికుల నమ్మకం.