'అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా బోధన చేయాలి'

'అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా బోధన చేయాలి'

BHNG: విద్యార్థుల్లోని సృజనాత్మక ఆలోచనలకు పదును పెట్టి అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్ మందడి ఉపేందర్ రెడ్డి అన్నారు. నిన్న భువనగిరిలోని జీనియస్ పాఠశాలలో నిర్వహించిన సైన్స్ ఫెయిర్‌ను పాఠశాల కరస్పాండెంట్ డాక్టర్ బి సూర్యనారాయణ రెడ్డి, ఛైర్మన్ పడాల శ్రీనివాస్‌తో కలిసి ప్రారంభించి మాట్లాడారు.