సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంపై శ్రీరామ్ ఆగ్రహం

సత్యసాయి: తాడిమర్రి మండలంలో రెవెన్యూ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంపై టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులతో కలిసి సోమవారం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి సమస్యలు ఎందుకు పరిష్కరించట్లేదని నిలదీశారు. అధికారుల సమాధానం దాటవేతపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వెంటనే సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.