భూ భారతి ద్వారా సమస్యలకు పరిష్కారం: తహసీల్దార్ అనిత

భూ భారతి ద్వారా సమస్యలకు పరిష్కారం: తహసీల్దార్ అనిత

BHNG: భూ భారతి చట్టం ద్వారా రైతుల భూ సమస్యలు పరిష్కారమవుతాయని రాజాపేట తహసీల్దార్ ఇంద్రకర్ అనిత అన్నారు. మంగళవారం రాజాపేట మండలం లక్ష్మక్కపల్లిలో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులో ఆమె మాట్లాడారు. రెవెన్యూ రికార్డులలో తప్పుల సవరణకు, పెండింగ్ సాదాబైనామా దరఖాస్తులకు పరిష్కారం లభిస్తుందన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె తెలిపారు.