నిజాంపేటలో ఇసుక లారీ బీభత్సం
MDK: నిజాంపేట మండలంలో శనివారం తెల్లవారుజామున ఇసుక లారీ అదుపుతప్పి డివైడర్ వద్ద పార్కింగ్ చేసి ఉన్న ఎక్సెల్ బండిపైకి దూసుకెళ్లింది. డ్రైవర్ నిద్రమత్తు, నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. అదృష్టవశాత్తూ ఎవరికీ ప్రాణహాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై రాజేష్, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.