యడ్ల గంగరాజుకు YCP కీలక బాధ్యత
W.G: పాలకొల్లు 31వ వార్డు YCP కార్యవర్గ సమావేశం సోమవారం ఇన్ఛార్జ్ గుడాల శ్రీహరి గోపాలరావు ఆధ్వర్యంలో జరిగింది. వార్డు నూతన అధ్యక్షుడిగా యడ్ల గంగరాజును ఎన్నుకున్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని నేతలకు శ్రీహరి సూచించారు. ఈ సమావేశంలో YCP నేతలు యడ్ల తాతాజీ, కోరాడ శ్రీను, కార్యకర్తలు పాల్గొన్నారు.