రైతులకు అండగా కూటమి ప్రభుత్వం: ఎమ్మెల్యే

E G: కూటమి ప్రభుత్వ పాలనలో అన్నదాతలు ఆనందంగా ఉన్నారని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. గురువారం చాగల్లులో అన్నదాత విజయోత్సవ ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా ట్రాక్టర్ నడిపారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అన్నదాతకు రూ. 20 వేలు అందజేయడం జరుగుతుదన్నారు. రైతులకు అండగా కూటమి ప్రభుత్వం ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.