'చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది'

'చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది'

కృష్ణా: పామర్రు నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఆదివారం ధాన్యాన్ని రహదారిపై ఆరబెడుతున్న రైతుల వద్దకు వెళ్లి, వారి సమస్యలను ఎమ్మెల్యే కుమార్ రాజా అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం రైతులకు జవాబుదారితనంతో పనిచేస్తుందని, తేమ శాతంలో ఇబ్బందులుంటే రైతు సేవ కేంద్రం అండగా నిలుస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ప్రభుత్వం రైతుల వద్ద నుంచి చివర గింజ వరకు కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు.