సిద్దిపేటలో రేషన్ బియ్యం కోసం బలవంతపు కొనుగోలు

సిద్దిపేటలో రేషన్ బియ్యం కోసం బలవంతపు కొనుగోలు

SDPT: రేషన్ దుకాణదారులు కొత్త షరతులు విధిస్తున్నారు. రూ.100 విలువైన ఇతర సరుకులు కొనుగోలు చేసినప్పుడే రేషన్ బియ్యం ఇస్తామని ప్రజలపై ఒత్తిడి తెస్తున్నారు. ఉప్పు, సర్ఫ్, డిష్ వాష్ సబ్బు వంటి లోకల్ బ్రాండ్ సరుకులను తప్పనిసరిగా కొనాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఉచితంగా రేషన్ బియ్యం అందజేసే పథకం అమలు చేస్తున్నప్పటికీ దుకాణదారులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు.