యువతీ ఉరివేసుకొని ఆత్మహత్య
ప్రకాశం: పామూరు మండలం అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన వివాహిత మాధవి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని చూసి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే మృతికి గల కారణాలు తెలియవలసి ఉందని పోలీసులు అన్నారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.