ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన ఎమ్మెల్యే
JN: రఘునాథపల్లి మండలంలోని మంగలి తండా గ్రామంలో ఇందిరమ్మ ఇంటిని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అర్హులైన పేద ప్రజలకు ప్రాధాన్యత క్రమంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని, పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నేతలు పాల్గొన్నారు.