భానుడు వచ్చినా తగ్గని పొగమంచు
VKB: కుల్కచర్ల మండలంలో దట్టమైన పొగమంచు, చలితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం వేళ దారి కనిపించకపోవడంతో వాహనదారులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. మంచు తగ్గిన తర్వాతే ముందుకు వెళ్తున్నామని ప్రయాణికులు తెలిపారు. రాబోయే రెండు రోజులు కూడా దట్టమైన పొగమంచు కప్పే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.